నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు

దేవరుప్పుల: నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్‌ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ సంపత్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని చిన్నమడూరు ఎస్‌ఎస్‌లో అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు బ్రేకర్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంతోపాటు గృహ అవసరాలకు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నందున వినియోగదారులు విధిగా శాఖాపరంగా మంజూరు, ఇంటి మీటర్లు తీసుకోవాలన్నారు. అక్రమ విద్యుత్‌ వాడకందారులకు శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఈలు లక్ష్మీనారాయణరెడ్డి, విజయ్‌కుమార్‌, ఏడీఈ అనిల్‌, ఏఈ నర్సింహ్ములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement