బొక్కకూర..బగార బువ్వ
స్టేషన్‌ఘన్‌పూర్: మొదటి విడత ఎన్నికలకు మరో మూడు రోజులే గడువు ఉండడంతో గ్రామాల్లో పంచాయతీ ప్రచారం ఊపందుకుంది. ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు మధ్యాహ్నం గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్న వారికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం పలు గ్రామాల్లో ప్రచారం అనంతరం చికెన్ కూర, బగార అన్నంతో భోజనాలు ఏర్పాట్లు చేశారు. దాంతో పార్టీలు, అభ్యర్థులకు అతీతంగా పలువురు బొక్క కూర.. బగారా బువ్వ అంటూ కమ్మని భోజనం చేశామని చెపుతున్నారు. గ్రామాల్లో టెంట్లు, భోజనాలతో ఎన్నికల సందడితో పెళ్లి తరహాలో ఎన్నికల సందడి జోరందుకుంది.


