క్రీడలతో శారీరక దృఢత్వం పెంపు
ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు
జనగామ రూరల్: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందుతుందని, విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటే భవిష్యత్తులో గొప్పవారవుతారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 11వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్, డీఎస్‌సీడీఓ డాక్టర్ బి.విక్రమ్, డీఐఓ కె. జితేందర్‌రెడ్డి, ఎంపీడీఓ బి.మహేశ్, ఎంఈఓ జి.శంకర్‌రెడ్డి, మల్టీజోన్–1 ఆఫీసర్ అరుణకుమారి, జోనల్ ఆఫీసర్ ఎస్.విద్యారాణి, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ అలగోని నర్సింహులు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రసాయన రహిత సాగుపై అవగాహన
కల్పించాలి
ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ అభ్యసించిన కృషి సఖీలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మండల సమాఖ్య సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకొని, అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల స్థాయిలో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతగా 1875 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించామననారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, నాబార్డ్ ఏజీఎం చైతన్య రవి తంగ, వ్యవసాయ అధికారి శరత్ చంద్ర , డీఆర్డీఏ జిల్లా అధికారి వసంత, అసిస్టెంట్ డీఆర్డీఏ అధికారి నిరుద్దీన్, డీపీఎం నళిని , మారి స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం కార్యకర్తలు మారపాక వెంకటస్వామి, మల్కాపురం ప్రమోద్, రావుల రాజేందర్, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ చెవ్వ కరుణాకర్ పాల్గొన్నారు.
ఇంటి నుంచే యూరియా బుకింగ్
యాప్ ద్వారా యూరియాని బుక్ చేయడం ద్వారా రైతులకు సాఫీగా సమర్థవంతంగా అందుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ అమలుపై కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 20వ తేదీ నుంచి జిల్లాలో యూరియా అమ్మకాలు పూర్తిగా బుకింగ్ యాప్ ద్వారానే జరగాలన్నారు. జిల్లాలోని ప్రతి యూరియా విక్రయ కేంద్రంలో రైతు రిజిస్టర్ నిర్వహణ తప్పనిసరి అని యూరియా పొందే ప్రతి రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పంట వివరాలు, యూరియా బుకింగ్ ఐడీని తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.
జనగామ: జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సహకరించిన పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, విద్యాశాఖ, మాస్టర్ ట్రైనర్లు, పీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లు, జోనల్, రూట్ అధికారులు, హెల్త్, అంగన్‌వాడీ టీచర్లు, విద్యుత్, జిల్లా గ్రామీణభివృద్ధి శాఖతో పాటు ఎలక్షన్ విధుల్లో భాగస్వామ్యం పంచుకున్న అన్ని శాఖల అధికారులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
11వ రాష్ట్రస్థాయి గురుకుల క్రీడలు
ప్రారంభం


