కోర్టు తీర్పు మోదీ, అమిత్‌షాకు చెంపదెబ్బ
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జనగామ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు కొట్టివేయడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెంపదెబ్బలాంటిదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మోదీ, అమిత్‌షా నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ కేసులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కోర్టు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై కక్ష సాధింపు రాజకీయాలే లక్ష్యంగా ఈడీ ద్వారా కేసులు నమోదు చేయించారని మండిపడ్డారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, ఇందిర, ఉడుత రవి, లింగాల నర్సింరెడ్డి, గౌస్, స్టాలిన్, కృష్ణ ఉన్నారు.


