సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగా యని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పో లింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని పేర్కొన్నారు.
పెంబర్తి ఏఐఎఫ్ సైన్స్ ల్యాబ్ పరిశీలన
జనగామ రూరల్: జిల్లాలో విద్యా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ గురువారం మండలంలోని పెంబర్తి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐఎఫ్ సైన్స్ ల్యాబ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఉన్న పరికరాలు, విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అందుతున్న శిక్షణ, బోధనా విధానాలు ల్యాబ్ వినియోగంపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో ఆధుని క సైన్స్ ల్యాబ్‌లు విద్యార్థుల విజ్ఞానాభివృద్ధికి దోహదపడతాయన్నారు.
పనులు వేగవంతంగా పూర్తి చేయండి
లింగాలఘణపురం: కేజీవీబీలో ఇటీవల మంజూరైన మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్‌కుమార్ ఆదేశించారు. మండలంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో రూ.42 లక్షలతో జరుగుతున్న అదనపు గది, సీసీ డ్రైన్, టాయిలెట్స్ నిర్మాణం, కిచెన్ గదిలో మరమ్మతు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ విష్ణుమూర్తి, ఏఎంఓ శ్రీనివాసు, జీసీడీఓ గౌసియాబేగం, డీఈ రవీందర్, ఏఈ వెంకటనర్సు, స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ ఉన్నారు.
నేడు నర్మెటలో విద్యుత్ వినియోగదారుల సదస్సు
జనగామ: నర్మెట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో సేవలు అందిస్తున్న వినియోగదారుల సమస్యలపై టీజీఎన్‌పీడీసీఎల్ వినియోగదారుల ఫోరం (సీజీఆర్‌ఎఫ్‌ఐ) సమావేశం ఈనెల 19న(శుక్రవారం) నిర్వహించడం జరుగుతుందని డీఈ లక్ష్మినారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఇందులో ట్రాన్స్‌ఫార్మర్ మార్పులు, మోటార్ మార్చడం, లైన్ల హార్డువేర్ సమస్యలు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెరుగులు, మీటర్ మార్పులు, సరఫరా నాణ్యత, బిల్లుల సవరణ, బిల్లుల వివాదాలు వంటి అనేక అంశాలపై వినియోగదారులు ఫోరానికి వినతి చేసుకోవచ్చన్నారు. సీజీఆర్‌ఎఫ్‌ఐ ఫోరం చైర్మన్ ఎన్‌వీ వెంకటగోపాలచారి (8712481311), టెక్నికల్ సభ్యుడు కె.రమేశ్ (8712481314), ఫైనాన్‌న్స్ సభ్యుడు ఎన్.దేవేందర్ (8712481316), స్వతంత్ర సభ్యుడు ఎం.రామారావు (8712481485) సదస్సుకు హాజరుకానున్నట్లు తెలిపారు.
నేటి నుంచి ‘మాస్టర్‌ప్లాన్’ డ్రోన్ సర్వే
జనగామ: జనగామ పట్టణ అభివృద్ధిలో అమృత్–2.0లో భాగంగా జీఐఎస్ బేస్‌డ్ కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు ఈనెల 19(శుక్రవారం) నుంచి డ్రోన్ సర్వేను 20వ తేదీ వరకు రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన మెస్సర్ ఆర్‌ఎస్‌ఐ సాఫ్ట్‌టెక్ ప్రతినిధులు జనగామకు రానున్నట్లు తెలిపారు. పట్టణ పరిపాలన, ట్రాఫిక్, ప్రజాసౌకర్యాలు, రోడ్లు, ఇంటి నిర్మాణాలు, పార్కులు, వాటర్ డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలపై సమాచారాన్ని కచ్చితత్వంతో సేకరించడం దీని ఉద్దేశమన్నారు. డ్రోన్ సర్వే సమయంలో ఇళ్ల పైకప్పులపై ఎలాంటి కార్యకలాపాలు చేయరాదన్నారు. జనగామ పట్టణాభివృద్ధి కోసం చేపట్టబోయే డ్రోన్ సర్వే ఒక కీలక అడుగని, సర్వే విజయవంతం అయ్యేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం


