ఎట్టకేలకు ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక ఎట్టకేలకు జరిగింది. మండలంలో సమస్యాత్మక గ్రామంగా ఉన్న ఇప్పగూడెంలో నూతనంగా ఎన్నికై న వార్డు సభ్యుల మధ్య సయోధ్య లేక వరుసగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే. పోలింగ్ జరిగిన ఈనెల 11న, అనంతరం 12న, 15న, 16వ తేదీన వరుసగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ఎంపీడీఓ, ఆర్‌ఓ, పంచాయతీ అఽధికారులు ప్రయత్నించినా వార్డుసభ్యుల మధ్య సయోధ్య లేక వాయిదా పడింది. గ్రామంలో కాంగ్రెస్, సీపీఎం పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లగా కాంగ్రెస్, సీపీఎం బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా ఆరు వార్డులు కాంగ్రెస్, ఆరు వార్డులు సీపీఎం కై వసం చేసుకున్నాయి. ముందస్తు ఒప్పందం మేరకు సీపీఎంకు ఉపసర్పంచ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే సీపీఎం నుంచి గెలిచిన ఆరుగురు వార్డు సభ్యులలో 5, 6, 11వ వార్డుల నుంచి గెలుపొందిన వారు ఉపసర్పంచ్ కోసం పట్టుబట్టగా నాలుగుసార్లు ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది.
ఉపసర్పంచ్‌గా లింగనబోయిన రాజు
ఎట్టకేలకు ఉపసర్పంచ్ ఎన్నిక జరుగగా సీపీఎం బలపర్చిన అభ్యర్థిగా ఆరో వార్డు నుంచి గెలుపొందిన లింగనబోయిన రాజు ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపసర్పంచ్ ఎన్నిక కోసం చివరి అవకాశంగా ఎంపీడీఓ నర్సింగరావు, పంచాయతీ కార్యదర్శులు నరేశ్, సత్యనారాయణ గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వార్డు సభ్యులకు సమయం ఇవ్వగా గడువు సమయానికి సరిగ్గా పదినిమిషాల ముందు కాంగ్రెస్, సీపీఎం నాయకులతో కలిసి నూతన సర్పంచ్ మందపురం రాణిఅనీల్, 11 మంది వార్డుసభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తంగా 12 వార్డులకు గాను ఐదో వార్డు సభ్యుడు పోలాసు పద్మాకర్ గైర్హాజరయ్యారు. కాగా ఉపసర్పంచ్‌గా రాజును వార్డు సభ్యుడు మంద మహేందర్ ప్రతిపాదించగా మరో వార్డు సభ్యుడు కత్తుల రాజయ్య బలపర్చారు. దాంతో ఏకగ్రీవంగా లింగనబోయిన రాజు ఉపసర్పంచ్‌గా ఎన్నికై నట్లు మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ నర్సింగరావు ప్రకటించారు. దాంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్, సీపీఎం శ్రేణులు బాణాసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నాయి.
ఏకగ్రీవంగా ఎన్నికై న
లింగనబోయిన రాజు
ఎట్టకేలకు ఇప్పగూడెం ఉపసర్పంచ్ ఎన్నిక


