ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి
జనగామ: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా సజావుగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ నిఖిల(ఐఏఎస్)నోడల్ అధికారులకు సూచించారు. జీపీ ఎలక్షన్లకు సంబంధించి గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆమె నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న ఎన్నికల ఏర్పాట్లతో పాటు నోడల్ అధికారుల నియామకం, వారికి అప్పగించిన బాధ్యతల గురించి జనరల్ అబ్జర్వర్‌కు వివరించారు. అనంతరం నిఖిల మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన ప్రతీ అంశంపై అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురి షా, వ్యయ పరిశీలకులు జయశ్రీ, డీఆర్డీఓ పీడీ వసంత, డీపీఓ నవీన్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం
జీపీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి అబ్జర్వర్ నిఖిల మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ పల్లవి, ఈడీఏం గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల జనరల్ అబ్జర్వర్ నిఖిల


