మొదటిరోజు 152 నామినేషన్లు
దాఖలైన నామినేషన్లు
జనగామ: సర్పంచ్ ఎలక్షన్ల ప్రక్రియ పట్టాలెక్కగా, జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గంలో గురువారం నుంచి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, చిల్పూరు, జఫర్‌గఢ్, స్టేషన్‌న్‌ఘన్‌పూర్ మండలాల్లో తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ భారీ జోష్‌తో మొదలైయింది. మొదటి రోజు మొత్తం 152 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 106 సర్పంచ్, 46 వార్డు సభ్యుల స్థానాలకు వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా, కలెక్టర్ ఆధ్వర్యంలోని రెవెన్యూ, ఎలక్షన్ సెల్ మరియు ఇతర విభాగాలు పర్యవేక్షణ చేపట్టాయి. అభ్యర్థులు తమ అనుచరులతో ర్యాలీగా నామినేషన్ కేంద్రాలకు తరలివచ్చారు. నామినేషన్ల పర్వం మొదలు కాగా జిల్లా జనరల్ అబ్జర్వర్ నిఖిల్(ఐఏఎస్), కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి ఆయా మండలాల పరిధిలో నామినేషన్ కేంద్రాలను సందర్శించి పరిశీలన చేశారు. అదనపు కలెక్టర్లు బెన్‌న్ షాలోమ్, పింకేశ్ కుమార్, ఆర్డీఓ గోపీరామ్, వెంకన్న, తహసీల్దార్లు, ఎంపీడీవోలు సైతం వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
మండలం సర్పంచ్ వార్డు మొత్తం
సభ్యులు
చిల్పూరు 16 11 27
రఘునాథపల్లి 35 8 43
లిం.ఘణపురం 15 11 26
జఫర్‌గఢ్ 23 9 32
స్టేషన్‌ఘన్‌పూర్ 17 7 24
సర్పంచ్–106, వార్డు సభ్యులు– 46
మొదటి విడత ఎన్నికల
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన
కలెక్టర్, జనరల్ అబ్జర్వర్


