బుగులు వెంకన్న నేత్రదర్శనం
చిల్పూరు: మండల కేంద్రంలోని బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం భూనీల సమేత వేంకటేశ్వరుడు నిజరూపంలో భక్తులకు నేత్ర దర్శనం లభించింది. స్వామివారి నేత్రదర్శనంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
జీడికల్ ఆలయ హుండీ ఆదాయం రూ.2.57లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,57,868లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. ఈ నెలలో మొదలైన జీడికల్ వీరాచల బ్రహ్మోత్సవాల అనంతరం గురువారం దేవాదాయ ఇన్‌స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. ఈసారి భక్తులు అధికంగానే వచ్చిన గత ఏడాది ఆదాయంతో పోల్చితే తక్కువగానే వచ్చింది. కార్యక్రమంలో సిబ్బంది భరత్, మల్లేశం పాల్గొన్నారు.
బాలసాహిత్యభేరికి
మోడల్ స్కూల్ విద్యార్థులు
లింగాలఘణపురం: మండలంలోని మోడల్ స్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థినిలు బి.ఉజ్వల, కె.సాయిప్రసన్నకు తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ఈ నెల 30న వర్చువల్‌గా నిర్వహించే అంతర్జాతీయ శతాధిక బాలరచయితల వచన కవితా సమ్మేళనం బాలసాహిత్యభేరిలో పాల్గొనే అవకాశం లభించింది. గురువారం ప్రిన్సిపాల్ సునిత మాట్లాడుతూ.. ఇప్పటికే వీరిద్దరు జిల్లా, రాష్ట్రస్థాయిలో వచన కవితలో అనేక బహుమతులు గెలుపొందడంతో అవకాశం లభించిందన్నా రు. బాలసాహిత్యభేరిలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొంటారని ప్రిన్పిపాల్ పేర్కొన్నారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్
పోటీలకు ఎంపిక
పాలకుర్తి: మండలంలోని చెన్నూ రు గ్రామానికి చెందిన బాలబోయిన సందీప్, రావుల కు మారస్వామి అనే విద్యార్థులు తెలంగాణ 12వ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఆదిలాబాద్‌లో జరుగనున్న పోటీల్లో వారు పాల్గొంటారు. సీనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల ఎంపికలో 80 మంది పాల్గొన్నారు. ఇద్దరు విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
ధాన్యం బస్తాలు వేగంగా మిల్లులకు తరలించాలి
రఘునాథపల్లి: ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం మండలంంలోని నిడిగొండ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. సన్న ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ వస్తుందా? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి భూ భారతి, రెవెన్యూ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ఆయన వెంట తహసీల్దార్ ఫణికిషోర్ ఉన్నారు.
ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలి
రఘునాథపల్లి: ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని ఖిలాషాపూర్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో నామినేషన్లు వేసే ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్లలో సంతకాలు, వారికి సంబంధించిన పూర్తి సమాచారం పొందుపరుస్తున్నారా, ఏమైనా తప్పులు దొర్లుతున్నాయా అని పీఓలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
ఉజ్వల
సాయిప్రసన్న
బుగులు వెంకన్న నేత్రదర్శనం
బుగులు వెంకన్న నేత్రదర్శనం
బుగులు వెంకన్న నేత్రదర్శనం
బుగులు వెంకన్న నేత్రదర్శనం


