గరంగరం..రసవత్తరం
స్టేషన్‌ఘన్‌పూర్: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం గ్రామ పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు గ్రామాల్లో ఎక్కువ మంది సముఖత చూపుతుండగా వారిని ఒక్కతాటిపైకి తీసుకురావడం పార్టీల నాయకులకు కత్తిమీద సాములాగా మారింది. నామినేషన్లకు కేవలం మరోరెండు రోజులే గడువు ఉండడంతో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి నలుగురైదుగురు పోటీకి వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో జరిగే సమావేశాల్లో వాదనలు, వాగ్వాదాలతో రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీ గ్రామ కమిటీలు, మండల, జిల్లా నాయకులు నచ్చజెప్పడంతో కొందరు పట్టు విడుస్తున్నా గ్రామానికి ఇద్దరు, ముగ్గురు మాత్రం తప్పనిసరిగా బరిలో ఉండేలా కనిపిస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద తప్పేలా లేదు. సర్పంచ్‌లుగా పోటీ చేయాలనుకునే ఆశావహులు ఎవ్వరికీ వారే తామే గెలుస్తామనే ధీమాతో స్థానిక ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేలా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధాన పార్టీలకు తలనొప్పిగా
అభ్యర్థుల ఎంపిక


