
ప్రజాస్వామ్యానికి ముప్పు..
ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యత జర్నలిస్టులది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విలువలకు పెద్ద దెబ్బ. ఆంధ్రప్రదేశ్ ఇటీవల జర్నలిస్టులపై దాడులు విచారకరం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ప్రజల పక్షాన ప్రశ్నించినపుడు వాటిని ఫీడ్‌బ్యాక్‌గా తీసుకొని సమస్యలు పరిష్కరించి మెరుగైన పాలన అందించడం కోసం కృషి చేయాలి. ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణకు కట్టుబడి ఉండాలి. దాడుల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్య తీసుకోవాలి. ప్రతి జర్నలిస్టు నిర్భయంగా పని చేసే వాతావరణం ప్రభుత్వం కల్పించాలి.
– డి.శ్రీనివాస్,
టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ