
పట్ణణ అభివృద్ధికి మహర్దశ
● జీఐఎస్ ఆధారితంగా మొదటి మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన
● సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
జనగామ: జనగామ పట్టణ అభివృద్ధిలో మరో అడుగు పడింది. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, పట్టణం (విలీనమైన గ్రామ పంచాయతీలతో సహా) కోసం సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం ప్రారంభమైంది. ఈ ప్రణాళిక ‘ఇన్–హౌస్ఙ్’ విధానంలో రూపొందించబడుతోంది. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా, జీఐఎస్ ఆధారిత మొదటి మాస్టర్ ప్లాన్‌న్ రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ వర్క్‌షాప్‌లో మాస్టర్‌ప్లాన్, ప్రణాళిక పరిధితో పాటు పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. పట్టణ భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచే ఈ మాస్టర్‌ప్లాన్ ద్వారా జనగామ సమగ్ర పట్టణ మౌలిక వసతులు, రహదారులు, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పచ్చదనం, సామాజిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వబడనుంది. కాగా ఈ ఏడాది జనవరి 14 నుంచి 24వ తేదీ వరకు మాస్టర్‌ప్లాన్ కోసం డ్రోన్ సర్వే నిర్వహించారు.
మాస్టర్ ప్లాన్ వివరాలు ఇవ్వండి
పట్టణన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి మునిసిపల్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ పంచాయతీరాజ్, ఇరిగేషన్, డీఎంహెచ్‌వో, అగ్రికల్చర్, మార్కెటింగ్, మెప్మా తదితర శాఖల అధికారులతో మాస్టర్‌ప్లాన్ మొదటి రూపకల్పనపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.. మాస్టర్ ప్లాన్ తయారీ కోసం మున్సిపల్ అధికారులు, 23 శాఖల సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రత్యేక కార్యాచరణతో విజయోస్తు 2.0
వచ్చే పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్‌తో కలిసి విజయోస్తు 2.0, పదో తరగతి పరీక్షలు, డిజిటల్ లర్నింగ్ కరిక్యులం, లైబ్రరీ, తదితర అంశాలపై హెచ్‌ఎంలతో సమీక్షించారు.
పంటల నమోదు తప్పనిసరి..
జనగామ రూరల్: పంటల నమోదు చేయించడం తప్పనిసరి అని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మకానికి ఇది తప్పనిసరి ఆధారమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.