
‘సాక్షి’పై కక్ష సాధింపు తగదు
ఏపీ ప్రభుత్వ దమనకాండపై జర్నలిస్టుల ఆగ్రహం
జనగామ: సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు తగదని, దాడులను తిప్పికొట్టే సమయం వచ్చిందని జర్నలిస్టులు స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతీ పాత్రికేయుడు ధైర్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం సాక్షి మీడియా ప్రతినిధులు కొత్తపల్లి కిరణ్ కుమార్, సురిగెల భిక్షపతి, నేతి ఉపేందర్, గోవర్దనం వేణుగోపాల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరస న చేపట్టారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ పాత్రికేయులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ఐజేయూ రాష్ట్ర ప్రతినిధి పార్నంది వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్టు కన్నా పరుశరాములు మాట్లాడుతూ.. నకిలీ మద్యం, అవినీతి, ప్రజాసమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రిక ప్రతిరోజూ ప్రజాస్వా మ్య బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. ఇలాంటి ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. ఇది కేవలం ఒక పత్రికపై కాదని, మీడియా స్వేచ్ఛపై దాడి అని అన్నారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఏపీ ప్రభుత్వం ఒత్తిడికిలోనై పనిచేస్తున్న పోలీ సుల తీరును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం జర్నలిస్టులు నిజాలను వెలుగులోకి తెచ్చే క్రమంలో కేసులు పెట్టడం ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ చర్యనైనా ఎదుర్కొంటామన్నారు. అలాగే సాక్షి పట్ల ఐక్యత ప్రదర్శిస్తూ, ప్రజల కోసం జర్నలిజం కొనసాగుతుందనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీభాష్యం శేషాద్రి, జమాల్ షరీఫ్, అశోక్ కుమార్, లక్ష్మణ్, ఎండబట్ల భాస్కర్, హింజ మాధవరావు, శేషత్వం ఆనంద్ కుమార్, వంగ శ్రీకాంత్‌రెడ్డి, కాసాని ఉపేందర్, బండి శ్రీనివాస్ రెడ్డి, చౌదర్పల్లి ఉపేందర్, శివశంకర్, తిప్పారాపు ఉపేందర్, భాను, రమేశ్, భా స్కర్, కేమెడీ ఉపేందర్, ఓరుగంటి సంతోష్, గణే శ్, మణి, వినయ్, యూసుఫ్, కిషోర్, మోహన్, మ ణి, మధు, సలీం, సురేష్, ఆశిష్, సుధాకర్, నరేష్, జయపాల్ రెడ్డి, శంకర్, బాబా, నవీన్ చారీ, రాజు, సుప్రీం, జితేందర్, శ్రీను, ఏజాజుద్దీన్ పాల్గొన్నారు.
మీడియా స్వేచ్ఛపై దాడులు సరికాదు
జనగామ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన