
బీసీబంద్‌కు సకలజన మద్దతు
● నేడు రైల్వేస్టేషన్ నుంచి భారీ ర్యాలీ
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 18న(శనివారం) నిర్వహించనున్న బీసీ బంద్‌కు అన్ని వర్గాల నుంచి అఖండ మద్దతు లభిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌ను రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, అన్ని రాజకీ య పార్టీలు, నాయకులు, విద్యార్థి సంఘాలు, రైతు, కార్మిక సంఘాలు ఒకే వేదికపై గళం కలుపుతున్నాయి. 42 శాతం రిజర్వేషన్లు కల్పించా లనే నినాదంతో ప్రతి బీసీ కుటుంబం ఒక్కటై ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతోంది.
నేడు భారీ ర్యాలీ..
బీసీ బంద్ నేపథ్యంలో పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీసీ సంఘాలు ప్లాన్ చేశాయి. ప్రైవేటు విద్యా, వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు బంద్ పాటించనున్నాయి. ర్యాలీలతో పాటు పెద్దఎత్తున నిరసన తెలుపనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి నిఘా వేయనున్నారు.