సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర

Oct 17 2025 6:34 AM | Updated on Oct 17 2025 6:34 AM

సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర

సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర

రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్‌ అధికారి వీడియో కాన్ఫరెన్స్‌..

జనగామ: జిల్లా రైతులు సాగుచేసి పండించిన పత్తిని నేరుగా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)సెంటర్లలో అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా పిలుపునిచ్చారు. సీజన్‌ ప్రారంభానికి ముందుగా పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సీసీఐ కార్యకలాపాలపై ఏర్పాట్లను సమీక్షిస్తూ కలెక్టర్‌ గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌తో కలిసి మార్కెటింగ్‌, వ్యవసాయశాఖ, ఫైర్‌, వి ద్యుత్త్‌, జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 15 పత్తి మిల్లుల పరిధిలో సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమీక్షలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి సబిత, వ్యవసాయశాఖ అధికారి అంబికాసోని, లీగల్‌ మెట్రాలజీ అధికారి ఝాన్సీ, ఎన్‌పీడీసీఎల్‌ డీఈ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాలి..

ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు నమ్మకం ఉంటుందని, దాన్ని కాపాడుకునే విధంగా వైద్యాధికారులు సేవలందించాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా సూచించారు. కలెక్టరేట్‌లో వైద్యసేవలకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా వైద్య అధికారి, పీహెచ్‌సీల మెడికల్‌ అధికారులు, సూపర్‌వైజర్‌లతో కలెక్టర్‌ సమీక్షించారు.

రుణం మంజూరు చేయాలి..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆన్‌లైన్‌లో వెంటనే నమోదు చేసి బ్రిక్స్‌, సిమెంట్‌, యూనిట్స్‌ ఏర్పాటుకు స్వయం సహాయక సభ్యులకు రుణ మంజూరు చేయాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో గూగుల్‌ మీటింగ్‌ ద్వారా సమీక్షించారు.

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలాశాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్‌ అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, ఆర్డీవో లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement