
దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి..
జనగామ రూరల్: దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్, గానుగుపహాడ్, పెద్దపహాడ్, వడ్లకొండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, పీఏసీఎస్ సీఈవో భాస్కర్‌రెడ్డి, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళారులను ఆశ్రయించొద్దు..
నర్మెట/తరిగొప్పుల: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. నర్మెట మండలం హన్మంతాపురం, తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి