
రైతుల సంక్షేమమే లక్ష్యం
స్టేషన్‌ఘన్‌పూర్: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. గురువారం మండలంలోని నమిలిగొండ గ్రామంలో, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.. రైతులు దళారుల వద్ద మోసపోవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వసంత, డీఏఓ అంబికాసోని, ఏడీఏ వసంత సుగుణ, డీసీఓ కోదండరాం, ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి