
ఒక్కరోజే 133 మద్యం టెండర్లు
జనగామ: జిల్లా ఎకై ్సజ్ శాఖలో చివరి నిమిషంలో టెండర్ల ప్రక్రియ జోరందుకుంది. రెండు రోజుల వరకు నిశ్శబ్దంగా ఉన్న మద్యం షాపుల టెండర్లకు ఒక్కసారిగా దరఖాస్తుల వెల్లువ కనిపించింది. గురువారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 133 దరఖాస్తులు స్వీకరించడంతో అధికారులు కొంతమేర ఊపరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు పెద్దగా స్పందన కనిపించకపోవడంతో ఎకై ్సజ్ శాఖ ఆందోళన చెందగా, చివరి రోజుల్లో వ్యాపారులు ముందుకు వస్తుండడంతో అధికారుల ముందస్తు అంచనాకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. చివరి రోజులైన శుక్ర, శుక్ర, శనివారాల్లో ఇదే ఉత్సాహం కొనసాగుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు 92 టెండర్లు రాగా, 16వ తేదీన ఒక్కరోజే 133 దాఖలయ్యాయి. దీంతో మొత్తం దరఖాస్తులు 225కు చేరుకున్నాయి.
నేడు, రేపు భారీగా పెరిగే అవకాశం