మూడో ఏటనే.. బడికి పంపారు | - | Sakshi
Sakshi News home page

మూడో ఏటనే.. బడికి పంపారు

Jun 12 2025 7:35 AM | Updated on Jun 12 2025 7:35 AM

మూడో

మూడో ఏటనే.. బడికి పంపారు

నన్ను రెండేళ్లు దాటి మూడో ఏడు రాగానే బడికి పంపించారు. అయితే.. నా గోల భరించలేక మా అమ్మ ఓ పథకం వేసి బడిలో అయితే కాస్త భయంతో ఉంటానని అనుకుని ఉండొచ్చు. ప్రైమరీ స్కూల్‌లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. పెద్ద సారు క్యాడర్‌ పెద్దది కాబట్టి మాకు చిన్నసారే పలక మీద ఓనమాలు పెట్టించేది. ఆయనకు పెద్ద మీసాలు ఉండేవి. పిల్లలంతా ఈయనకి కూడా భయపడే వారు. అనంతరం హైస్కూల్‌ చదువులోనూ ఎప్పుడూ ఫస్ట్‌ ఉండేదాన్ని. బడికి వెళ్లాలంటే ఏనాడు భయపడలేదు. తల్లి ప్రోత్సాహంతో చదివి ఉన్నతస్థాయికి ఎదిగాను. ఇప్పటికీ బాల్య స్మృతులు గుర్తుకు వస్తే.. ఎంతో సంతోషంగా ఉంటుంది. – నెల్లుట్ల రమాదేవి, ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్‌ జోనల్‌ చీఫ్‌ మేనేజర్‌, శివునిపల్లి

మూడో ఏటనే.. బడికి పంపారు 1
1/1

మూడో ఏటనే.. బడికి పంపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement