
టీచర్లకే తల్లిదండ్రుల సపోర్టు
జనగామరూరల్: ఒకటో తరగతి నుంచి 5 వరకు స్వగ్రామంలోనే చదివాను. తమ్మడపల్లి, పెద్దరామన్‌చర్ల, పెద్దపహాడ్, పసరమడ్ల నుంచి విద్యార్థులు ఈ స్కూల్‌కే వచ్చేవారు. చిన్నప్పుడు నాకు సోమిరెడ్డి, మల్లారెడ్డి సార్లు తొలిగురువులు. మాకు చదువుతోపాటు ఆట పాటల్లో ప్రత్యేక పీరియడ్స్ ఉండేవి. ఉపాధ్యాయులు చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక్కరోజు పాఠశాలకు రాకున్నా ఆయమ్మ(గోపమ్మ) ఇంటికి వచ్చి ఎందుకు రాలేదని అడిగే వారు. గురువులంటే భయమూ భక్తి ఉండేది. చదువు సరిగా రాకపోతే ఉపాధ్యాయులు మందలించే వారు. తల్లితండ్రులు కూడా వారినే సమర్థించే వారు.
– బాలాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, ఓబుల్‌కేశ్వాపూర్, జనగామ