చెప్రాసి అంటే హడల్‌.. | - | Sakshi
Sakshi News home page

చెప్రాసి అంటే హడల్‌..

Jun 12 2025 7:33 AM | Updated on Jun 12 2025 7:33 AM

చెప్ర

చెప్రాసి అంటే హడల్‌..

జనగామ రూరల్‌ : నాటి కాలంలో బడికి వెళ్లాలంటే భయపడే వాళ్లం. ఒక్క పూట బడి మానేసినా.. ఉపాధ్యాయుడి కంటే చెప్రాసి కట్టే పట్టుకొని వస్తున్నాడంటే వణికి పోయేటోళ్లం. అప్పుడు గ్రామంలో ఒకే ఒక్క పాఠశాల ఉండడంతో సర్పంచ్‌ నుంచి పటేల్‌ పట్వారీ పిల్లల వరకు అందరూ సర్కారు స్కూల్‌కే వెళ్లాం. విద్యతో పాటు క్రీడలు కూడా నేర్పించే వాళ్లు. స్వగ్రామం వడ్లకొండలోనే 7వ తరగతి వరకు చదువుకున్నాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఉన్నత పదవిలో ఉన్నాను.

– రవీందర్‌యాదవ్‌, వీసీ, ఉస్మానియా

విశ్వవిద్యాలయం, వడ్లకొండ(జనగామ)

చదివిన స్కూల్‌లోనే టీచర్‌గా..

తరిగొప్పుల: మేం చదువుకునే రోజుల్లో టీచర్లు అంటే భయం ఉండేది. ఎదురుగా నిలబడే సాహసం చేసేవాళ్లం కాదు. వారు స్థానికంగానే ఉండేవారు. చదవకున్నా.. హోం వర్క్‌ చేయకపోయినా బెత్తంతో దండించేవారు. ఆ భయం నేటి విద్యార్థుల్లో లేదు. స్థానిక పాఠశాలలో 1970 సంవత్సరం విద్యాభ్యా సం ప్రారంభించాను. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ పూర్తి చేసి ప్రభుత్వ టీచర్‌గా పదోన్న తి పొందాను. విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలలోనే టీచర్‌గా పని చేశాను.

– మచ్చ చిరంజీవులు,

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు, తరిగొప్పుల

చెప్రాసి అంటే హడల్‌..1
1/1

చెప్రాసి అంటే హడల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement