
పర్యావరణ ప్రేమికుడు ‘అంజి’
‘మొక్కలు నాటి సంరక్షించుకుందాం.. కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి శివారు దర్గాతండాకు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా అంజి పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాడు. అంజి ఓ వైపు ఆటో నడుపుతూ.. మరో వైపు వ్యవసాయం ఆధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోడ్డుపక్కన ఎండుతున్న మొక్కలు, ఎడారిగా మారుతున్న ఆటవీ ప్రాంతాలను చూసి చలించిపోయిన అతను పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచాలనే ఆలోచనతో తన ఆటోకు వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేసుకుని బయలుదేరాడు. శుక్రవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో అంజిని ‘సాక్షి’ పలకరించగా.. ‘ప్రకృతిని నాశనం చేస్తున్నారు.. ఏళ్ల నాటి మహావృక్షాలు నేలకొరిగి పోతున్నాయి.. మొక్కలు నాటడం తప్ప సంరక్షించడంలేదు’.. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
– జనగామ

పర్యావరణ ప్రేమికుడు ‘అంజి’