
దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
అందుబాటులో ఉన్న
ఎరువులు వివరాలు
(మెట్రిక్ టన్నులు)
ఈనెలలో నమోదైన
వర్షపాతం వివరాలు
(మిల్లీమీటర్లలో)
● టాస్క్‌ఫోర్స్ టీంల తనిఖీలు ముమ్మరం
● నార్లు పోయడానికి పొలాలు సిద్ధం
● పత్తి విత్తన కొనుగోళ్లలో రైతులు బిజీ
యూరియా డీఏపీ
26,086 5,386.5
తేదీ వర్షపాతం
20 0.4
21 10.3
22 12.2
23 0.7
24 7.3
25 5.5
26 6.1
27 28.7
28 34.1
ఎస్‌ఎస్‌పీ కాంప్లెక్స్ పొటాష్
1,783 10,599 3,529
అందుబాటులో
ఉన్న విత్తనాలు
వరి
44,012
మెట్రిక్ టన్నులు
పత్తి ప్యాకెట్లు
5.80లక్షలు
పంటల సాగు అంచనా వివరాలు(ఎకరాల్లో)
మొక్కజొన్న
వరి పత్తి
2.15 1.25
లక్షలు లక్షలు
3,670
కందులు పెసర్లు వేరుశనగ
3,500 700 100
జనగామ: యాసంగి ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరుకున్నాయి. మరో వైపు వానా కాలం సీజన్‌కు సమయమం ఆసన్నమైంది. గత ఏడాది కంటే ముందుగానే రుతుపవణాలు ఎంట్రీ ఇవ్వగా.. అల్పపీడన ద్రోణి ప్రభావంతో అడపా దడపా వర్షాలు కురుస్తూనే ఉన్నా యి. నేల తల్లినే నమ్ముకున్న రైతన్నలు వానాకాలం సాగుకు సమాయత్తమయ్యారు. దుక్కులుదున్ని.. గొర్రుకొట్టి వరి నార్లకు పొలాలను సిద్ధం చేయగా.. పత్తి విత్తనాలు నాటేందుకు సాళ్లను రెడీ చేసుకున్నారు. కత్తెర సాగు(మూడో పంట) నాట్లు మొదలయ్యాయి. వచ్చే నెల 10 నుంచి 15వ తేదీ వరకు పత్తి సాగు ముమ్మరం కానుండగా.. 10 నుంచి 20వ తేదీ లోపు వరి నాట్లు ఊపందుకోనున్నాయి. జిల్లాలో ఈ నెలలో సాధారణ వర్షపాతం 27.1 మిల్లీమీటర్లు కాగా.. 100.8 మి.మీ కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
3.40లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, పెసర్లు, టుబాకో, వేరుశనగ తదితర పంటలు 3.40లక్షల ఎకరా ల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ముందస్తు అంచనా వేసింది. ఇందుకు తగినట్టుగా ఫర్టిలైజర్ దుకాణాలు, గ్రోమోర్ కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచింది. యూరియా, డీఏపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్, పొటాష్ 47,383 మెట్రిక్ టన్నులు, వరి విత్తనాలు 44,012 మెట్రిక్ టన్నులు, 5.80 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి.
టాస్క్‌ఫోర్స్ టీంలు
ఎరువులు, విత్తన ప్యాకెట్ల కృత్రిమ కొరత, నకిలీల బెడద, ఎమ్మార్పీకంటే అధిక ధరలకు విక్రయాలపై నిఘా పెట్టేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో డీఏఓ రామారావు ఆధ్వర్యాన మండలాల వారీగా ఏఓ, రెవెన్యూ ఆఫీసర్, ఎస్సై(పోలీసు) బృందంతో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేస్తున్నారు.
సాగు పనులు మొదలు పెట్టాం..
వానాకాలం సీజన్‌లో రెండెకెరాల్లో వరి, మరో రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాను. వరిలో 1010 దొడ్డురకం, పత్తిలో మైకోసీడ్స్ తీసుకున్నాను. ఎమ్మార్పీ ధరలకే విత్తనాలు ఇచ్చారు. రెండు రోజుల నుంచి వానలు పడుతున్నాయి. సాగు పనులు మొదలు పెట్టాం. – లూనావత్ బాలు, రైతు, క్రిష్ణాజీగూడెం(స్టేషన్‌ఘన్‌పూర్)
విత్తన ప్యాకెట్‌కు ధర పెరిగింది
నాకున్న రెండు ఎకరాల్లో వరి సాగు చేసేందుకు దుక్కులు దున్ని సిద్ధం చేసిన. 2 విత్తన ప్యాకెట్లు రూ.800 చొప్పున కొనుగోలు చేశాను. గత సీజన్ కంటే ఈసారి 10 కిలోల విత్తన ప్యాకెట్ ధర రూ.50 పెరిగింది.
– కర్రె చంద్రయ్య, రైతు, కొన్నె(బచ్చన్నపేట)
ఐదు ఎకరాల్లో పత్తి సాగు
నాకు ఏడెకరాల పొలం ఉంది. ఐదెకరాల్లో పత్తి, రెండెకరాల్లో వరి సాగుకు సిద్ధం చేసుకున్న. విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేసిన. ఎమ్మార్పీ ధరకే ఇచ్చారు. రెండు రోజుల క్రితం భూమి దున్ని అచ్చుకట్టిన. సాళ్లలో పత్తి విత్తనాలు వేస్తున్నాను.
– భూక్య బాషా, రైతు, టీబీతండా(జఫర్‌గఢ్)
వానాకాలం పంటలు మొదలయ్యాయి
జిల్లాలో వానాకాలం సాగు పనులు మొదలయ్యాయి. రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో భూమి కొంతమేర చల్లబడింది. జూన్ 10 నుంచి 15 వరకు పత్తి, అదే నెల 10 నుంచి 20 వరకు వరినాట్లు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. వరి కత్తెర పంట నాట్లు మొదలు పెట్టారు. సరిపడా విత్తనాలు ఉన్నాయి. నకిలీల బెడద, ఎమ్మార్పీకంటే అదనపు ధరలు, విత్తన ప్యాకెట్ల కొరత లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశాం. – రామారావు, డీఏఓ
న్యూస్‌రీల్
విత్తనాల కొనుగోళ్లలో బిజీ
జిల్లాలో రెండు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తన ప్యాకెట్ల కొనుగోళ్లతో ఎరువుల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. వరి విత్తనాల్లో సన్నరకం కేఎన్‌ఎం, ఆర్‌ఎన్‌ఆర్ 1271, దొడ్డు రకం 1010, 64, జేజీఎల్ తదితర సీడ్స్ అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్నలో కావేరి, బెయిర్, సింజెంటా, పత్తిలో టాటాబిగ్‌ఎక్స్, బాహుబలి, సదానంద్, చంద్రగోల్డ్, రాశి వైరెటీలు, యూఎస్ 6067, ఎస్‌సీహెచ్ 414, సనాతన్, బాక్సర్, సురేఖ గోల్డ్, ఆదిత్య–10 వంటి విత్తన ప్యాకెట్లకు పలు చోట్ల డిమాండ్ ఉంది.

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు

దుక్కులు దున్ని.. గొర్రుకొట్టిన అన్నదాతలు