
ఉపాధి హామీ పనుల పరిశీలన
జనగామ రూరల్: శామీర్‌పేట గ్రామంలో ఉపాధి హామీ పనులను జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ కూలీల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే కూలి రూ.307 వచ్చే విధంగా కొలతల ప్రకారం పనిచేయాలని, ఇందుకు సంబంధిత అధికారులు, ఎఫ్‌ఏలు కృషి చేయాలని చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ సంపత్ కుమార్, ఈసీ మాధవరెడ్డి, టీఏ అనిల్‌గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ రాములు పాల్గొన్నారు.
దేవాలయ భూమికి హద్దులు
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని ఇటీవ ల రెండుమార్లు సర్వే చేసిన అనంతరం బుధవారం దేవాదాయ శాఖ ఏడీ మన్నెంకొండ ఆధ్వర్యాన సిబ్బంది హద్దులు నాటారు. ఆలయానికి 229 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత అన్యాక్రాంతమైనట్లు తెలియగా సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసినట్లు ఏడీ చెప్పారు. తహసీల్దార్ సరస్వతి, ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్‌రావు, ధర్మకర్తలు గనగోని రమేష్, కొలిపాక రాజు, వెంకటేశ్వర్లు, మోతె మహేష్, భూక్య శ్రీను పాల్గొన్నారు.
కోళ్ల గూడులో బాలిక
దేవరుప్పుల: కామారెడ్డికి చెందిన మహమ్మద్ యూసఫ్ పాషా కూతురు మెహరిన్(నాలుగేళ్ల వయసు) ఇంటి వద్ద బుధవారం తప్పిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా స్పందించిన ఎస్సై సృజన్‌కుమార్ సిబ్బందిని పంపించారు. చుట్టుపక్కల వెతుకుతుండగా పరిసరాల్లోని మరో ఇంటిలో ని కోళ్ల గూడులో మెహరిన్ కనిపించింది. వెంట నే బాలికను ఇంటి వద్దకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక ఆచూకీ సత్వరమే కనుగొన్న హెడ్ కానిస్టేబుల్ సదయ్య, కానిస్టేబుళ్లు యాకూబ్, అశోక్, యాకేష్, గౌస్ పాషాను స్థానికులు అభినందించారు.
నియామక ఇంటర్వ్యూలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్యాకేంద్రంలో డిప్లొమా ఇన్ యోగా కోర్సు బోధనకు బుధవారం కౌన్సెలర్ల నియామకానికి ఇంట ర్వ్యూలు నిర్వహించారు. దూర విద్య డైరెక్టర్ బి.సురేష్‌లాల్, విద్యావిభాగం డీన్ ఎన్.రాంనాఽథ్‌కిషన్, బీఓఎస్, వరంగల్ నిట్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. 9 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

ఉపాధి హామీ పనుల పరిశీలన

ఉపాధి హామీ పనుల పరిశీలన