● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
జనగామ రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరి ష్కారమే ధ్యేయమని నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఎన్‌ఆర్ గార్డెన్‌లో పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యాన అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదట నెహ్రూ పార్కు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నిలిచి పోయిన ఉపాధ్యాయ పదో న్నతులు, బదిలీల పునరుద్ధరణ, అందరికీ నగదు రహిత ఆరోగ్య కార్డులు అందించడమే లక్ష్యమన్నా రు. అందరికీ అందుబా టులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి, నాయకుడు నూకల ఎల్లారెడ్డి, వివిధ సంఘాల జిల్లాల బాధ్యులు మిర్యాల సతీష్‌రెడ్డి, మంద తిరుపతిరెడ్డి, శ్రీహరి, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గంగిశెట్టి మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.