స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గ ప్రజలను మరోసారి దగా చేసేందుకు సీఎంతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుట్ర చేస్తూ అభివృద్ధి పనులు అంటూ ప్ర జలను మభ్యపెడుతున్నాడని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశా రు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం శివునిపల్లిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. మామునూరు ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడుతున్నారని, గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చే స్తుందని గుర్తించాలన్నారు. మండల ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రడపాక ప్రదీప్, నాయకులు ఇల్లందుల సారయ్య, కుమ్మం సతీష్, గోనెల శివకృష్ణ, తాళ్లపెల్లి శ్రీనివాస్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు