ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం శ్రీవిల్లి పుత్తూరు తమిళనాడు శ్రీశఠగోప సిద్ధాంత పీఠం శఠగోపముని రామానుజ జీయర్‌స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం పక్షాన సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. స్వామివారి శాషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, వేదపండితులు, ముఖ్య అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మెరుగైన సేవలు అందించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో నూతనంగా సింగిల్ విండో చైర్మన్‌లుగా నామినేట్ అయిన మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కొలుగూరి దామోదర్‌రావు, తంగెళ్ల రమేశ్‌లు ఆదివారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలవగా, నూతన చైర్మన్‌లకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘాలు రుణాలు ఇవ్వడం, తీసుకోవడమే కాదని, సంఘాల ద్వారా వ్యాపారాలు నిర్వహించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ అమలు చేయాలి
జగిత్యాలజోన్: ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం సీఎంకు లేఖ రాశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20లక్షలకు పైగా నిరుద్యోగ యువకులు ఆటో రిక్షా డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారని అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1000 పెన్షన్ ఇస్తామి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మూడేళ్లయినా ఆ హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలతో కలిపి ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పుష్కరాల నాటికి పనులు పూర్తి
వెల్గటూర్: వచ్చే సంవత్సరం మార్చిలో జరుగనున్న గోదావరి పుష్కరాల నాటికి కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్ అన్నారు. కోటిలింగాల ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఆదివారం కొలతలను మార్కింగ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటయ్య, దేవాదాయ శాఖ సీఈ దుర్గాప్రసాద్, ఈఈ రాజేశ్, ఏఈ సంతోష్, ఈవో కాంతారెడ్డి, ఆర్కిటెక్చర్స్ కన్సల్టెన్సీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
సూరమ్మ ప్రాజెక్టు సందర్శన
కథలాపూర్: కథలాపూర్ మండలం కలిగోట లోని సూరమ్మ ప్రాజెక్టును బీజేపీ రాష్ట్ర అధికా ర ప్రతినిధి గోపాల్‌రెడ్డి ఆదివారం నాయకులతో కలిసి సందర్శించారు. అధికారంలోకి వ చ్చాక 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ ఇప్పటివరకు పూర్తి కాలేదన్నారు. కాలువ పనుల్లో భూములు కోల్పోయిన రైతు ను మ భ్యపెట్టి భయపెట్టి అరకొరగా పరిహారం ఇ వ్వడం సరికాదని తెలిపారు. భూములకు బదులు భూమి ఇవ్వాలని లేకపోతే ఎకరానికి రూ.40 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పనులు ఎప్పటిలోగా పూర్తి చేయిస్తారో ప్రకటించాలని, ప్రాజెక్టులో ఉన్న నీటిని తొలగించవద్దని కోరారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, పలువురు నాయకులు పాల్గొన్నారు.


