ధర్మపురి: ప్రజా ప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా ప్రజా సంక్షేమం కోసం రత్నాకర్‌రావు అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పేద ప్రజల సంక్షేమంతో పాటు రైతుల సంక్షేమానికి అహర్నిశలు తపించిన గొప్ప వ్యక్తి రత్నాకర్‌రావు అన్నారు. సాగు, తాగు నీటి విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని, ఆయన చేసిన సేవలు చరిత్ర పుటల్లో నిలిచిపోతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి ల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్ దినేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, నాయకులు చిలుముల లక్ష్మణ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


