మీరాబాయి చాను | - | Sakshi
Sakshi News home page

మీరాబాయి చాను

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

● ఉమ్మడి జిల్లా వెయిట్‌లిఫ్టర్లకు ఆదర్శంగా మీరాబాయి విజయం ● క్రీడాకారుల్లో నూతనోత్సాహం మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ

బంగారు స్ఫూర్తి...

కరీంనగర్‌స్పోర్ట్స్‌: గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌–2026లో భారత వెయిట్‌లిఫ్టింగ్‌ స్టార్‌ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడం దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించాలని కలలు కంటున్న యువ క్రీడాకారుల్లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపుతోంది. సరైన శిక్షణ, కఠోరసాధన, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సాధ్యమేనని ఆమె నిరూపించారు. ఆమె విజయం ఉమ్మడి జిల్లా వెయిట్‌ లిఫ్టర్లకు స్ఫూర్తిగా నిలుస్తోందని జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ప్రపంచ వేదికపై విజయాలు సాధించవచ్చని మీరాబాయి మరోసారి నిరూపించారని కొనియాడారు.

కామన్‌వెల్త్‌ పతకంతో మీరాబాయి చాను

జాతీయ స్థాయి పోటీపాల్గొన్న శృతి (కరీంనగర్‌)

మీరాబాయి చాను విజయం మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపించారు. ఆమె విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత పట్టుదలతో శిక్షణ కొనసాగిస్తాను. ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల.

– ఎం సాయిదుర్గ, జాతీయ వెయిట్‌లిఫ్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement