రైతుబజార్‌లోనే కూరగాయలు విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్‌లోనే కూరగాయలు విక్రయించాలి

Jul 28 2026 1:24 AM | Updated on Jul 28 2026 1:24 AM

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని రైతుబజార్‌లో రైతులెవరూ కూరగాయలు విక్రయించడం లేదు. ప్రధాన రోడ్డుపైనే విక్రయిస్తుండడంతో వాహనదారులు, ఆస్పత్రులకు వచ్చేవారు, వాకర్స్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై తరచూ మున్సిపల్‌ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లడంతో శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రైతుబజార్‌లోపల గద్దెలు, చెత్తాచెదారం తొలగించారు. పోలీసుల సహకారంతో మున్సిపల్‌ కమిషనర్‌ సత్యప్రణవ్‌, కౌన్సిలర్లు రైతులందరినీ రైతుబజార్‌ లోపలికి పంపించారు. ఇక నుంచి అక్కడే విక్రయించాలని ఆదేశించారు.

పేద విద్యార్థికి ఉచిత ఇంజినీరింగ్‌ సీటు

తిమ్మాపూర్‌/ముస్తాబాద్‌: ఆ తల్లి చివరి కోరిక నెరవేరింది. ఆర్థిక ఇబ్బందులతో కొడుకును ఇంజినీరింగ్‌ చదివించలేకపోతున్నానని ఆ మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కరీంనగర్‌లోని జ్యోతి ష్మతి కళాశాల యాజమాన్యం స్పందించింది. మానవత్వంతో ఆ తల్లి చివరి కోరికను నెరవేర్చింది. ముస్తాబాద్‌ మండలం ఆవునూరుకు చెందిన బండి లావణ్య 15 రోజుల క్రితం కొడుకు ఇంజినీరింగ్‌ చదువుకు ఫీజు చెల్లించలేకపోతున్నానని మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లావణ్య భర్త రవీందర్‌ ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లాడు. ఈ సంఘటనపై సాక్షి ఈనెల 24న ‘చితికి పోతున్నారు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. జ్యోతిష్మతి ఇంజినీరింగ్‌ కళాశాల యజమాని జువ్వాడి సాగర్‌రా వు స్పందించారు. వికాస్‌కు జ్యోతిష్మతి కళాశాలలో పూర్తి ఉచిత బీటెక్‌ ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లపాటు హాస్టల్‌ వసతి కూడా ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఏ విద్యార్థి భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వికాస్‌.. చైర్మన్‌ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ జువ్వాడి సుమిత్‌సాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు బైరి శ్రీనివాస్‌గౌడ్‌, ఆశాగౌడ్‌, సావిత్రి తదితరులు సాగర్‌రావు, సుమిత్‌సాయిలకు, సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement