కోరుట్లటౌన్: పట్టణంలోని పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన మడతపెట్టే ఎలక్ట్రిక్ సైకిల్ ప్రాజెక్టు జాతీయస్థాయి వికసిత్ భారత్ బిల్డ్‌థాన్ పోటీలకు ఎంపికై న విషయం తెల్సిందే. హెచ్‌ఎం వడ్లకొండ గంగాధర్, ప్రాజెక్టు సైన్స్ గైడ్ టీచర్ చందా నాగరాజును పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హైదరాబాద్ రప్పించుకుని విద్యార్థులను అభినందిస్తూ ప్రశంస పత్రం అందజేశారు. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, హరిత ఇంధనరంగంపై ఉన్న అవగాహనను అభినందించినట్లు హెచ్‌ఎం తెలిపారు.


