ఫస్టియర్‌లో బాలికలు 73.97 శాతం.. బాలురు 48.06 శాతం ఉత్తీర్ణత సెకండియర్‌లో బాలికలు 82.18 శాతం.. బాలురు 64.71 శాతం ఉత్తీర్ణత రాష్ట్రంలో ఫస్టియర్‌లో 13వ, సెకండియర్‌లో 10వ స్థానంలో నిలిచిన జిల్లా
పెరిగిన ఉత్తీర్ణత శాతం
జగిత్యాల: ఇంటర్ బోర్డు మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈ సంవత్సరం కూడా జిల్లాలో బాలికలు సత్తాచాటారు. ఫస్టియర్ ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానంలో నిలవగా, సెకండియర్‌లో 10వ స్థానం సాధించింది. జిల్లాలో మొత్తం 75 జూనియర్ కళాశాలలుండగా 16 ప్రభుత్వ, 13 మోడల్ స్కూల్స్, 12 కేజీబీవీ, 5 సోషల్ వెల్ఫేర్, 5 మైనార్టీ, 5 బీసీ రెసిడెన్షియల్, 2 టీఎస్‌డబ్ల్యూఆర్‌సీజేసీ, ప్రైవేటు కాలేజీలు 17 ఉన్నాయి.
● ప్రథమ సంవత్సరంలో..
జిల్లాలో మొదటి సంవత్సరంలో బాలురు మొత్తం 2,861 మంది పరీక్షలు రాయగా 1,375 మంది పాసయ్యారు. 48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 3,784 మంది బాలికలు పరీక్షలు రాయగా 2,799 మంది పాసయ్యారు. 73.97 శాతం ఉత్తీర్ణత సాధించారు.
● ద్వితీయ సంవత్సరంలో..
ద్వితీయ సంవత్సరంలో బాలురు 2,414 మంది పరీక్షలు రాయగా 1,562 మంది పాసయ్యారు. 64.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,378 బాలికలు పరీక్షలు రాయగా 2,776 మంది పాసయ్యారు. 82.18 శాతం ఉత్తీర్ణత సాధించారు.
● ఇంటర్ సప్లిమెంటరీలో..
ఇంటర్ జనరల్, సప్లిమెంటరీలో 435 మంది బాలురు పరీక్షలు రాయగా 131 మంది పాసయ్యారు. 30.11 ఉత్తీర్ణత శాతం సాధించారు. 305 బాలికలు పరీక్షలు రాయగా, 111 మంది పాసయ్యారు. 36.39 శాతం ఉత్తీర్ణత సాధించారు.
● ఫస్టియర్ ఒకేషనల్‌లో..
ఫస్టియర్ ఒకేషనల్‌లో 564 మంది బాలురు పరీక్షలు రాయగా 259 మంది పాసయ్యారు. 45.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. 491 బాలికలు పరీక్షలు రాయగా, 372 మంది పాసయ్యారు. 75.76 శాతం ఉత్తీర్ణత సాధించారు.
● సెకండియర్ ఒకేషనల్‌లో..
సెకండియర్ ఒకేషనల్‌లో 474 మంది బాలురు పరీక్షలు రాయగా 283 మంది పాసయ్యారు. 59.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. 359 బాలికలు పరీక్షలు రాయగా, 319 మంది పాసయ్యారు. 88.86 శాతం ఉత్తీర్ణత సాధించారు.
● సెకండియర్ సప్లిమెంటరీలో..
సెకండియర్ ఒకేషనల్ సప్లిమెంటరీలో 53 మంది బాలురు పరీక్షలు రాయగా 36 మంది పాసయ్యారు. 67.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. 9 మంది బాలికలు పరీక్షలు రాయగా, 5 మంది పాసయ్యారు. 55.56 శాతం ఉత్తీర్ణత సాధించారు.
జగిత్యాల: గతేడాది కంటే ఈసారి ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు జిల్లా నోడల్ అధికారి నారాయణ తెలిపారు. గత విద్యా సంవత్సరం కంటే ఈసారి ఫస్టియర్‌లో 6.47 శాతం, సెకండియర్‌లో 6.17 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే విద్యార్థులు ఏదైనా సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చినా, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించుకునే వారు ఈనెల 20 వరకు ఫీజు చెల్లించి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. జవాబు ప్రతిని సైతం పొందవచ్చని పేర్కొన్నారు.


