గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దే | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దే

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

● మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

రాయికల్‌(జగిత్యాల): గిరిజనులకు 6 శాతం నుంచి 10శాతం వరకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దేనని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాయికల్‌ మండలం రాజానగర్‌ గ్రామంలోని గిరిజన తండాలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ హయాంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని, నిరుపేద బీసీ విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదని, దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేసీఆర్‌ రైతుబంధు ఎకరాకు రూ.5వేలు ఇస్తే రేవంత్‌రెడ్డి రైతులకు ఎలాంటి ఆర్థికసాయం అందించడం లేదని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం అయ్యారన్నారు. సర్పంచ్‌లు భారతపు రాజశేఖర్‌, నల్లాల స్వామి, మాజీ సర్పంచ్‌లు మొక్కొండ రాంరెడ్డి, సబావత్‌ సరోజ, కొమ్ముల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement