జగిత్యాలక్రైం: జనాభా లెక్కలు, ప్రభుత్వ సర్వేల పేరిట ఇళ్లకు వచ్చేవారితో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా భోదన్ పట్టణంలో కొంతమంది ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ, జనాభా లెక్కలు నిర్వహిస్తున్నామని చెప్పి ఇళ్లకు వెళ్లి చోరీలకు పాల్పడడం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిజమైన ప్రభుత్వ సిబ్బంది అధికార గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు కలిగి ఉంటారని పేర్కొన్నారు. ఎవరైనా వారి ధ్రువీకరణ పత్రాలు చూపించకుంటే ఇళ్లలోకి అనుమతించవద్దని, అవసరమైతే పోలీస్‌స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒంటరిగా నివసించే వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు.
‘అడ్లూరి’పై ఆరోపణలు సరికాదు
ధర్మపురి: ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై ఆరోపణలు చేయడం సరికాదని, బీఆర్‌ఎస్ హయాంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని గ్రంథాలయ చైర్మన్ దినేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ధర్మపురిలో గోదావరి తలాపున ఉన్నా పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడ్డారని అందుకే, బీఆర్‌ఎస్‌ను చీ కొడుతున్నారని విమర్శించారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, రెండేళ్లు పాలించిన కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై ఎలాంటి చర్చలకై నా సిద్ధమని సవాల్ విసిరారు. గొల్లపెల్లి, వెల్గటూర్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు నిశాంత్‌రెడ్డి, శైలేందర్‌రెడ్డి, నాయకులు వేముల రాజు, సర్పంచ్ చిలుముల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేశ్ తదితరులున్నారు.


