కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

మల్లాపూర్‌(కోరుట్ల): ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఽఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మండలకేంద్రంతో పాటు రేగుంట గ్రామంలో పర్యటించారు. రేగుంటలో శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేసిందన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పాలనవైఫల్యంతో రాష్ట్రం అన్నిరంగాల్లో తిరోగమనంలోకి వెళ్లిందని విమర్శించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు చిట్యాల లక్ష్మణ్‌, తీట్ల లహరిరాజేశ్‌, నాయకులు శరత్‌గౌడ్‌, రామాగౌడ్‌, భూమారెడ్డి, గంగరాజం, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement