ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం

Apr 13 2026 7:44 AM | Updated on Apr 13 2026 7:44 AM

● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

రాయికల్‌/జగిత్యాలరూరల్‌: ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల కలలు సాకారం అవుతాయని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం రాయికల్‌ మండలం ఆలూరు, సారంగాపూర్‌ మండలం పోచంపేట, లచ్చక్కపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహా ప్రవేశం కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే సీఎం ధ్యేయమని, ప్రతీ గ్రామంలో పేదలను గుర్తించి రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకారం చేస్తున్నామన్నారు. సర్పంచ్‌ నల్లాల స్వామి, నాయకులు రవీందర్‌రావు, రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement