ధర్మపురి: పట్టణంలని వారసంతలో అమ్మకాలు నిలిపివేయడంతో తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ప్రతి శనివారం వారసంత సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది వాపారులు తమత మ వస్తువులను విక్రయించుకుంటారు. చింతామణి చెరువు కట్టపై కొందరు బట్టలు అమ్ముకుంటారు. బట్టల వ్యాపారులు రోడ్డుపై విక్రయాలు చేపట్టొద్దని మున్సిపల్ అధికారులు అడ్డుకోవడంతో తెచ్చుకున్న బట్టల మూటలన్నీ అలాగే ఉండిపోయాయి. 20ఏళ్లుగా ఇక్కడ అమ్మకాలు చేస్తున్నామని, దూర ప్రాంతాల నుంచి తెచ్చుకున్న అద్దె వాహనాలతో నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా.. గోదావరి పుష్కరాల సందర్భంగా రోడ్డు పనులు జరుగుతున్నందున రోడ్డుపై అమ్మకాలు నిలిపివేశామని, చెరువు కట్ట వాకింగ్ ట్రాక్‌పై పెట్టుకోవాలని సూచించామని, వ్యాపారులు బెట్టుకుపోయి అమ్ముకోలేదన్నారు.
ఆస్తి తీసుకుని పోషించడంలేదని..
కథలాపూర్: ఆస్తి తీసుకుని తనను పోషించడంలేదని మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రండం పుల్లయ్య తన చిన్న కూతురు లావణ్యతో కలిసి శనివారం కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పోతారం గ్రామానికి చెందిన రండం పుల్ల య్యకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికీ పెళ్లి అయ్యింది. పెద్ద కూతురు భర్తతో కలిసి పోతారంలో నివసిస్తోంది. చిన్న కూతురు లావణ్య కోరుట్లలో ఉంటోంది. తన ఆస్తి మొత్తాన్ని గ్రామంలో ఉంటున్న పెద్ద కూతురు తీసుకుందని, వృద్ధాప్యంలో ఉన్న తనను పోషించడంలేదని పుల్లయ్య చిన్న కూతురితో కలిసి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. గతంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. తనను పోషించాలని పెద్ద కూతురుకు చెప్పారని తెలిపారు. దీంతో విచారణ చేపట్టి తగిన న్యాయం చేస్తామని ఆర్డీవో వృద్ధుడికి సూచించడంతో కూతురుతో కలిసి వెళ్లిపోయాడు.


