కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో ఎన్‌ఆర్‌ఐలు ముందుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వంలో ఎన్‌ఆర్‌ఐలు ముందుకెళ్లాలి

Mar 29 2026 7:21 AM | Updated on Mar 29 2026 7:21 AM

● బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌టీసీ మాజీ చైర్మన్‌ కూర్మాచలం అనిల్‌

రాయికల్‌: మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వంలో ఎన్‌ఆర్‌ఐలంతా పార్టీ కోసం సైనికులా పనిచేయాలని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్‌టీసీ మాజీ చైర్మన్‌ కూర్మాచలం అనిల్‌ పిలుపునిచ్చారు. శనివారం లండన్‌లో బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎన్‌ఆర్‌ఐలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ నాయకత్వం శ్రీరామ రక్ష అని, కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాల్లోని లోపాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఎత్తిచూపాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసేవరకు సోషల్‌ మీడియా ద్వారా నిరసన చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, అడ్వైజరీ బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు హరిగౌడ్‌, సత్యమూర్తి, మాజీ అధ్యక్షుడు దూసరి అశోక్‌గౌడ్‌, జనరల్‌ సెక్రటరి రత్నాకర్‌, అడ్వైజరి బోర్డు వైస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement