జగిత్యాల: ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని, బడ్జెట్‌లో ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిత్యం ఢిల్లీ పర్యటనలకే పరిమితయ్యారని, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ
సీఎం సహాయ నిధి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. తన కార్యాలయంలో పలువురికి సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. నియోజకవర్గంలోని 24 మందికి రూ.5 లక్షల విలువైన చెక్కులు అందించామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


