జగిత్యాలక్రైం: జిల్లాలోని వివిధ కోర్టుల్లో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో 3034 సివిల్, క్రిమినల్, మోటార్ వాహనాల కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి తెలిపారు. సివిల్ 37, క్రిమినల్ 2,473, పెండింగ్ 2,510, ప్రిలిటిగేషన్ 524 కలిపి మొత్తం 3034 కేసులు పరిష్కారమయ్యాయి. మోటారు వాహనాల కేసుల్లో రూ.6,05,000 బాధితులకు పరిహారం ఇప్పించారు. కోర్టు కేసుల్లో ఉన్న ఇద్దరు దంపతులను రాజీమార్గం కుదిర్చి న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఏకం చేయించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ, సబ్ జడ్జి, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి వెంకటమల్లిక్ సుబ్రమణ్యశర్మ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.
ధర్మపురిలో 456 కేసుల పరిష్కారం
ధర్మపురి: ధర్మపురి సివిల్ కోర్టులో 456 కేసులు పరిష్కరించినట్లు సివిల్ కోర్టు జడ్జి శ్రీనిజ తెలిపారు. చిన్నచిన్న తప్పులతో షరతులకు పోకుండా రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, న్యాయవాదులు రామడుగు రాజేశ్, గడ్డం సత్యనారాయణరెడ్డి, బత్తిని ఇంద్రకరణ్, జాజాల రమేశ్ తదితరులు ఉన్నారు.
లోక్ అదాలత్‌లోనే సత్వర న్యాయం
మెట్‌పల్లి: లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం అందుతుందని సీనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావు అన్నారు. 300 కేసులు పరిష్కరించారు. ఇందుకు కృషి చేసిన పోలీసులు, న్యాయవాదులను అభినందించారు. జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దయ్య రాజారాం, ఏపీపీ ప్రణయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి, సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు కిరణ్‌కుమార్, నవీన్, అనిల్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.


