కలిగోట శివారులో పులి వదంతులు | - | Sakshi
Sakshi News home page

కలిగోట శివారులో పులి వదంతులు

Mar 24 2026 8:04 AM | Updated on Mar 24 2026 8:04 AM

● హైనాగా గుర్తించిన అటవీశాఖ అధికారులు

కథలాపూర్‌: మండలంలోని కలిగోట శివారులో పులి సంచరించినట్లు గ్రామంలో వదంతులు వ్యాపించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం ఉదయం ఆ ప్రాంతంలో పర్యటించారు. పాదముద్రలను పరిశీలించిన అధికారులు హైనాగా నిర్ధారించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో మెట్‌పల్లి ఎఫ్‌ఆర్‌వో పద్మారావు, సెక్షన్‌ ఆఫీసర్‌ ఎండీ.ముస్తాక్‌ ఆలీ, బీట్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌, సర్పంచ్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

దేవాదాయ కమిషనర్‌కు సన్మానం

ధర్మపురి: ధర్మపురిలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 12వరకు నిర్వహించిన శ్రీలక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సోమవారం దేవాదాయశాఖ కమిషనర్‌ హన్మంతరావును హైదరాబాద్‌లోని ఆయన చాంబర్‌లో ఈవో శ్రీనివాస్‌ కలిశారు. స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు అందించారు.

పుష్కరాలకు ఏర్పాట్లు ఘనంగా చేయాలి

జగిత్యాల: గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు ఘనంగా చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ అన్నారు. సోమవారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ప్రతిపాదనలు రూపొందించామని, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ఆమెకు వివరించారు.

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

మల్లాపూర్‌: మండలంలోని గోదావరి నది, పెద్దవాగు తీరప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ శ్రీనివాస్‌ హెచ్చరించారు. మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సోమవారం దాడులు నిర్వహించి సాతారం శివారులో రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని తహసీల్దార్‌ కార్యలయానికి తరలించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్‌ఐలు రాజేష్‌, అశోక్‌, జీపీవోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement