పోక్సో కోర్టు మాజీ పీపీ త్రిపుర మృతి | - | Sakshi
Sakshi News home page

పోక్సో కోర్టు మాజీ పీపీ త్రిపుర మృతి

Mar 24 2026 8:04 AM | Updated on Mar 24 2026 8:04 AM

జగిత్యాలజోన్‌: పోక్సో జిల్లా కోర్టు మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముదుగంటి త్రిపుర సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. జేఎన్టీయూలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ.. న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. జిల్లా కోర్టులో తొలితరం మహిళా న్యాయవాది. బార్‌ అసోసియేషన్‌లో మహిళా న్యాయవాదుల ప్రతినిధిగా ఐదా రేళ్లు పనిచేశారు. జిల్లాలో పోక్సో కోర్టు ఏర్పడగా.. తొలి పీపీగా పనిచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న త్రిపుర కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. త్రిపుర అంత్యక్రియలు మల్యా ల మండలం తక్కళ్లపల్లిలో మంగళవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాచకొండ శ్రీరాములు, అందె మారుతి సంతాపం తెలిపారు.

జేఎన్టీయూలో టెక్నికల్‌ సింపోజియం ప్రారంభం

కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూలో రెండురోజులపాటు నిర్వహించనున్న స్టూడెంట్‌ టెక్నికల్‌ సింపోజియం–2026 సోమవారం ప్రారంభించారు. ప్రిన్సిపల్‌ నరసింహ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి సింపోజిఎంలు ఉపయోగపడతాయన్నారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకతను ప్రదర్శించే దిశగా విద్యార్థులు ఆలోచించాలని సూచించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

క్షయ నిర్మూలనలో జిల్లా రెండోస్థానం

జగిత్యాల: క్షయవ్యాధి నిర్మూలనలో జిల్లాకు రెండోస్థానం లభించిందని డీఎంహెచ్‌వో సుజాత తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం వరల్డ్‌ టీబీ ఉత్సవాల్లో ఉత్తమ పురస్కారం అందిస్తారన్నారు. వైద్యసిబ్బంది బాధ్యతగా తోడ్పడ్డారని క్షయ నిర్మూలన అధికారి శ్రీనివాస్‌ అన్నారు. నరేందర్‌, రవీందర్‌, సత్యనారాయణ, హరీశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement