ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు సమకూర్చండి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు సమకూర్చండి

Mar 19 2026 7:57 AM | Updated on Mar 19 2026 7:57 AM

కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి వైద్య పరికరాలు సమకూర్చాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ అన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, పరికరాల కొరతపై ఎమ్మెల్యే బుధవారం శాసనసభలో ప్రస్తావించారు. రెండున్నరేళ్లుగా పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదన్నారు. కోరుట్ల ఆసుపత్రిలో ఈఎన్‌టీ సర్జన్‌, జనరల్‌ సర్జన్‌ ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు లేక రోగులకు సరైన వైద్య అందటం లేదన్నారు. వెంటనే పరికరాలు సమకూర్చాలని కోరారు. మెట్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పాత భవనం శిథిలావస్థలో ఉందని, ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని, కొత్త భవనం 90శాతం పూర్తయినా వినియోగంలోకి తేలేకపోతున్నారని తెలిపారు. మిగిలిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement