అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదు

Mar 18 2026 11:14 AM | Updated on Mar 18 2026 11:14 AM

కరీంనగర్‌టౌన్‌: అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, అన్నదాతలను విస్మరిస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, ఓసీ జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో ఉమ్మడి జిల్లా రైతు గర్జన సమరభేరీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 28న ఓసీ ఐకాస, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ మైదానంలో లక్షమందితో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు పెండ్యాల కేశవ రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి, అయిత నాగరాజు, బండ గోపాల్‌ రెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, బుర్రా శ్రీనివాస్‌ గౌడ్‌, చాడ రవీందర్‌ రెడ్డి, చింతల శ్రీనివాస్‌, కొత్తకొండ రవీందర్‌ రావు, గౌతమ్‌ శర్మ, చందుపట్ల జనార్ధన్‌, స్వామి పాల్గొన్నారు.

రైతు మహా గర్జన సమరభేరి సభకు వేలాదిగా తరలి రావాలి

రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పొలాడి రామారావు

ఓసీ ఐకాస జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement