పైడిమడుగు పీఏసీఎస్‌కు జాతీయ అవార్డు | - | Sakshi
Sakshi News home page

పైడిమడుగు పీఏసీఎస్‌కు జాతీయ అవార్డు

Mar 18 2026 11:13 AM | Updated on Mar 18 2026 11:13 AM

కోరుట్ల రూరల్‌: పైడిమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జాతీయస్థాయిలో ఉత్తమ సహకార సంఘంగా మూడోస్థానం దక్కించుకోగా.. మంగళవారం సిక్కీం రాజధాని గంగ్‌టాక్‌లో అవార్డు అందజేశారు. రూ.లక్ష5వేల నగదు పారితోషికం అందించారు. సంఘం సీఈవో బద్దం రాజేందర్‌, పర్సన్‌ ఇన్‌చార్జి అసద్‌ అవార్డు అందుకున్నారు. 2024–25 సంవత్సరానికి గాను నేషనల్‌ ఫెడరేషన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సిఫారసుతో నిర్వహించిన సర్వేలో అఖిల భారత స్థాయిలో మూడో బహుమతికి ఎంపికై ంది. ప్రాథమిక సహకార సంఘాల పని తీరు, ఆర్థిక లావాదేవీలు, రుణాల రీషెడ్యూల్‌, ఇతర సేవల నిర్వహణలో సమగ్రంగా పరి శీలించి అవార్డుకు ఎంపిక చేశారు. కేడీసీసీబీ మాజీ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు ఉన్నారు.

మార్కెట్‌ యార్డుకు సెలవులు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జగిత్యాల మార్కెట్‌ యార్డులకు అమవాస్య, ఉగాది, రంజాన్‌, ఆదివారం సందర్భంగా ఈనెల 18, 19, 21, 22 తేదీల్లో సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌రావు తెలిపారు. సెలవుల మధ్యలో 20న మార్కెట్‌ యార్డులో క్రయవిక్రయాలు జరుగుతాయని, తిరిగి సోమవారం నుంచి యధావిధిగా మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరుగుతాయని చెప్పారు.

గాలికుంటుతో పాల ఉత్పత్తి తగ్గుముఖం

పెగడపల్లి: గాలికుంటు వ్యాధి సోకిన పాడి పశువుకు పాల ఉత్పత్తి తగ్గుతుందని జిల్లా పశు వైద్యాధికారి ప్రకాశ్‌ అన్నారు. మండలంలోని మద్దులపల్లిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పశువైద్య శిబిరాన్ని సందర్శించారు. వాధి సోకడం వల్ల చూడి పశువుల్లో గర్భస్రావం జరుగుతుందని, కోలుకున్న తర్వాత పశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశముందన్నా రు. జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల పశువులుండగా ఇప్పటి వరకు 12వేల పశువులకు వ్యాక్సిన్‌ వేయడం జరిగిందన్నారు. సర్పంచ్‌ వెల్మ బలరామ్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి కిరణ్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ పెంటల తిరుపతి, గోపాలమిత్ర సూపర్‌వైజర్‌ నర్సయ్య పాల్గొన్నారు.

పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి

జగిత్యాల: పన్నుల వసూళ్లు వేగవంతం చేసి వంద శాతం లక్ష్యం సాధించాలని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో జగిత్యాల చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి రాబోయే రోజుల్లో వసూళ్లు వేగవంతం చేసి 100శాతం లక్ష్యం సాధించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు వంద శాతం లక్ష్యం తప్పనిసరి అన్నారు. చైర్‌పర్సన్‌ వాణి మాట్లాడుతూ, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.14 కోట్ల డిమాండ్‌ ఉండగా, సుమారు 6 కోట్లు వసూలయ్యాయని, ఇంకా రూ.8 కోట్లు వసూళ్లు చేయాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సుమారు రూ.4 కోట్లు వసూలు చే యాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులందరూ సమష్ఠిగా లక్ష్యం పూర్తి చేయాలన్నారు. కమిషనర్‌ స్పందన మాట్లాడుతూ, ప్రత్యేక డ్రైవ్‌, డోర్‌ టు డోర్‌ వసూళ్లు, వార్డుల వారిగా టార్గెట్లు అమలు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement