రెండో రోజూ ‘ఆశ’ల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రెండో రోజూ ‘ఆశ’ల ఆందోళన

Mar 18 2026 11:13 AM | Updated on Mar 18 2026 11:13 AM

జగిత్యాలటౌన్‌: సమస్యలు పరిష్కరించాలని, రాబోయే బడ్జెట్లో హెల్త్‌ మిషన్‌కు సరిపడా నిధులు కేటాయించాలని ఆశ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజు కొనసాగింది. కలెక్టరేట్‌ ఎదుట నిరసనకు దిగి తమను కలెక్టరేట్‌ లోపలికి అనుమతించాలని కోరగా.. సిబ్బంది నిరాకరించడంతో కలెక్టరేట్‌ గేట్‌ ఎక్కేందుకు య త్నించారు. దీంతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పందించిన జిల్లా వైద్యాధికారి, ఉప వైద్యాధికారి వారితో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి యత్నిస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్‌లో ఆశావర్కర్లకు రూ.18వేల ఫిక్స్‌డ్‌ వేతనంతోపాటు ఇతర సమస్య ల పరిష్కారం కోసం నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ కు సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. ఆశావర్కర్స్‌ యూనియన్‌ నాయకురాళ్లు రాయికంటి దివ్య, ప్రేమలత, బత్తిని వసంత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement