రాయికల్(జగిత్యాల): మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలో మంగళవారం ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, కమిషనర్ కీర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వపరంగా నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమానికి రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని మైనార్టీలకు ఎలాంటి సమాచారం లేదని మైనార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మందికి మాత్రమే పరిమితమయ్యేలా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మైనార్టీ తోఫా ఇవ్వకపోవడం బాధాకరం
జగిత్యాల: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీల తోఫా ఇవ్వకపోవడం బాధాకరమని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రతి ఏడాది తోఫా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. గత పాలనలో జగిత్యాల నియోజకవర్గంలో 4 వేల తోఫాలు ఇస్తే ప్రస్తుతం 1,200 తోఫాలతో సరిపెట్టి కుట్ర చేస్తుందన్నారు. గతంలో కల్యాణలక్ష్మి రూ.1.16 లక్షలు అందించడం జరిగిందన్నారు. ప్రస్తుత పాలనలో అన్ని వర్గాలవారు నష్టపోతున్నారన్నారు.


