కరీంనగర్‌రూరల్: హోమో సెక్స్ కోసం ఓ యువకుడిని కరీంనగర్‌కు పిలిపించి దాడికి పాల్పడి డబ్బులు దోచుకున్న ముగ్గురిని కరీంనగర్‌రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గురుడుపేటకు చెందిన రమిల్లా కృష్ణమూర్తిని గ్రౌండర్ డేటింగ్ యాప్ ద్వారా కరీంనగర్‌కు చెందిన జుమైర్ బుక్ చేసుకున్నాడు. హోమోసెక్స్, మసాజ్ చేయాలని, డబ్బులు చెల్లిస్తానని చెప్పడంతో ఈ నెల 14న బెల్లంపల్లిలో రైలెక్కి కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. కృష్ణమూర్తిని బైక్‌పై ఎక్కించుకున్న జుమైర్ బొమ్మకల్ బైపాస్‌లోని ఓ ఫంక్షన్‌హాల్ వెనుకభాగం తీసుకెళ్లాడు. కృష్ణమూర్తిని హోమోసెక్స్ చేయాలని బలవంతం చేస్తున్న క్రమంలో రేకుర్తికి చెందిన సయ్యద్ అబ్బాస్ అలియాస్ అర్బస్, కిసాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ అక్కడికి వచ్చారు. హోమో సెక్స్ చేసి ఎంత డబ్బు సంపాదిస్తున్నావంటూ కృష్ణమూర్తిని ప్రశ్నించారు. తన దగ్గర ఉన్న డబ్బులివ్వకుంటే చంపేస్తామంటూ బెదిరించారు. భయపడిన కృష్ణమూర్తి రూ.1,500 నగదుతోపాటు సెల్‌ఫోన్ అప్పగించాడు. అనంతరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం తీగలగుట్టపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. కేసును ఛేదించిన సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సైలు లక్ష్మారెడ్డి, నరేశ్‌ను సీపీ గౌస్ అలం, ఏసీపీ అభినందించారు.
హోమో సెక్స్‌కు పిలిచి దాడి
ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు


