రైతుల ఆత్మీయ బంధువు సీఎం | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మీయ బంధువు సీఎం

Mar 17 2026 7:33 AM | Updated on Mar 17 2026 7:33 AM

మల్లాపూర్‌: రాష్ట్రంలో అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే రూ.2లక్షల రుణాలను మాఫీ చేసి సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఆత్మీయ బంధువయ్యాడని ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్‌ కంచ రాజు అన్నారు. సోమవారం గొర్రెపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజును కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. యూత్‌ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పోతు శేఖర్‌, వేంపల్లి మాజీ సర్పంచ్‌ మిట్టపెల్లి జలపతిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కనుక లక్ష్మణ్‌, సకినపెల్లి రాజేశ్‌, నూతిపెల్లి వెంకటేశ్‌, అబ్బురి నాగరాజు, మహేశ్‌, సంజీవ్‌, రవీందర్‌, రాజరెడ్డి, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

హామీలు అమలు చేయాలి

కథలాపూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కథలాపూర్‌లో రోడ్డుపై సోమవారం బీజేపీ నాయకులు ధర్నా చేశారు. జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి, సామాజిక పింఛన్ల డబ్బుల పెంపు, రైతు భరోసా వంటి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తహసీల్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి, నాయకులు బద్రి సత్యం, ఆనంద్‌రెడ్డి, నరెడ్ల రవి, కథలాపూర్‌ మహేశ్‌, ప్రతాప్‌, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్‌లో..

మల్లాపూర్‌: ప్రజలు, రైతులకిచ్చిన అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం తహసీల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆర్‌ఐ రాజేశ్‌కు వినతిపత్రం అందించారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, యువ మోర్చా మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, వేంపల్లి సర్పంచ్‌ గుగ్లావత్‌ రాజేందర్‌, నాయకులు మొరపు జలపతి, ఇల్లెందుల కాంతాయ్యచారి, ఎర్ర రాజు, ముష్కరి రాజ్‌కుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

మేడిపల్లిలో..

మేడిపల్లి: హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని భీమారం, మేడిపల్లి మండలాల బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. చిట్యాల సురేశ్‌, నాగం శివకుమార్‌, క్యాతం దశరధరెడ్డి, తొగరి లక్ష్మిపతి, ముంజ శ్రీనివాస్‌, దుంపల మనోజ్‌రెడ్డి, ఎనుగుల లచ్చన్న, కోటగిరి లింగగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎంపిక పోటీలు

జగిత్యాలరూరల్‌: సారంగాపూర్‌ మండలస్థాయి క్రీడాపాఠశాలలో 4వతరగతి ప్రవేశాల కోసం ఈనెల 17న సారంగాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి కిశోర్‌ తెలిపారు. విద్యార్థులు విద్యార్హతలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫామ్‌తో ఉదయం పాఠశాలలో హాజరు కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement