వేంపేటలో దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

వేంపేటలో దొంగల హల్‌చల్‌

Mar 17 2026 7:33 AM | Updated on Mar 17 2026 7:33 AM

మెట్‌పల్లిరూరల్‌: మండలంలోని వేంపేటలో దొంగలు హల్‌చల్‌ సృష్టించారు. గ్రామంలోని మూడు ఆలయాలు, ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గంగమ్మ, రామాలయం, శివాలయంలో బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. కల్లెడ లత ఇంట్లో చోరీ చేశారు. ఎర్ధండిలోని తన తల్లిగారింటికి వెళ్లిన లత.. సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి 8 గ్రాముల బంగారం, 9 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.

బస్సు ఢీకొని..

మల్యాల: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మల్యాల ఎస్సై నరేశ్‌కుమార్‌ కథనం ప్రకారం..మల్యాల మండలం ముత్యంపేట శివారులోని జగిత్యాల–కరీంనగర్‌ జాతీయ రహదారిపై దిగువ కొండగట్టు బస్‌ స్టేజీ వద్ద సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చేరుకొని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

విశారదన్‌ మహారాజ్‌ అరెస్టుపై నిరసన

జగిత్యాలటౌన్‌: విశారదన్‌ మహారాజ్‌ అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం జగిత్యాల తహసీల్‌ చౌరస్తాలో జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. జాక్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌, ముసిపట్ల లక్ష్మీనారాయణ, గొల్లపల్లి శ్రీకాంత్‌గౌడ్‌, దువ్వాక శివమహారాజ్‌ పాల్గొన్నారు.

చెన్నకేశవనాథ ఆలయ హుండీ లెక్కింపు

రాయికల్‌: పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయ హుండీని సోమవారం లెక్కించగా రూ.82,535 ఆదాయం వచ్చినట్లు అధ్యక్షుడు మచ్చ శ్రీధర్‌ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సతీశ్‌శర్మ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, కార్యదర్శి మంతెన మహేందర్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి అశోక్‌, ప్రచార కార్యదర్శి నిరంజన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement